నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ 30వ వార్షికోత్సవం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో పిల్లలు, వృద్ధులకు అన్నదాన వితరణ : వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె దేవతనగర్ నాలుగో నంబర్ రోడ్డులోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయ పిల్లలకు, అలాగే బీకే పల్లిలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పోషక విలువలతో కూడిన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఈ. కవితారాణి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా దివ్యాంగులు, వితంతు మహిళలకు వివిధ సేవా కార్యక్రమాలు అందిస్తూ సమాజానికి సేవ చేస్తున్న వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి ఉదయ్ మోహన్ రెడ్డి, సంస్థ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు.
Reporter
Namitha News