Wednesday, 29 July 2026 02:32:26 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

Date : 01 January 2026 08:58 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 01 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యూనివర్సిటీ ప్రాంగణం లో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకనాథ్, ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ మరియు అధ్యాపకులు కేకును కట్చేసి ఘనంగా జరుపుకున్నారు. ప్రో ఛాన్సలర్ యెన్ ద్వారకనాథ్ మాట్లాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరంలో మిట్స్ కళాశాల అటానమస్ స్థాయి నుండి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి రావడం వెనుక విద్యార్థులు మరియు అధ్యాపకుల కృషిని ప్రశంసిస్తూ, సాధించిన విజయాలను నెమరవేసుకున్నారు. కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండి ఇప్పటి వరకు సాధించిన విజయాలను తెలుపుతూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాల విద్యను అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక ల్యాబొరేటరీస్ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొత్త ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అకాడమిక్ మరియు వ్యక్తిగత అభివృద్ధిలో ఉత్తమ ప్రతిభను కనబర్చాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. 2026 లో కూడా అందరికి మంచి జరగాలని మరియు మిట్స్ యూనివర్సిటీ మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి మనం అందరం కృషిచేయాలని ఆయన అన్నారు. వేడుకలలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, అడ్వైసర్స్ , వైస్ ప్రిన్సిపాల్, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :