Wednesday, 29 July 2026 08:45:03 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విశ్వం ఇంజనీరింగ్ కళాశాలల నందు ఏఐ ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్ పై అవగాహన కార్యక్రమం

Date : 13 November 2025 05:07 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాలల నందు ఏఐ ఫైనాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం 07 నవంబర్ 2025 తేదీన నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఆర్థిక లావాదేవీలలో జరుగుతున్న మోసాల రకాలపై అవగాహన కల్పించడం మరియు వాటిని కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో గుర్తించడం, నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా డా. నవీన్ విజయ్ ఆర్లాండో ఎఫ్., అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు వెర్టికల్ హెడ్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, రేవా యూనివర్సిటీ వారు హాజరై, పాల్గొనినవారికి విలువైన జ్ఞానం అందించారు. తన ప్రసంగంలో ఆయన కింది అంశాలను విశదీకరించారు. 1.ఆర్థిక లావాదేవీలలో జరిగే మోసాల రకాలు, 2 ఆన్లైన్ లావాదేవీల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, 3.ఫిర్యాదుల పరిష్కార విధానం అంశాలను క్లుప్తంగా విద్యార్థులకు తెలియజేశారు. డా. నవీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలు ఎలా మోసపూరిత కార్యకలాపాలను గుర్తించి వాటిని నివారించగలవో విశదీకరించారు. ఈ సెషన్ ఎంతో ఆసక్తికరంగా సాగి, పాల్గొన్నవారికి ఆర్థిక భద్రతపై విలువైన అవగాహన కలిగించారు. ఇప్పటి డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆర్థిక మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను గుర్తించడంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తుంది. ఏఐ ఆధారిత వ్యవస్థలు లావాదేవీలలోనే అనుమానాస్పద నమూనాలను గుర్తించి మోసపూరిత చర్యలను ముందుగానే అరికట్టగలవు. ప్రజల సురక్షితంగా ఆర్థిక లావాదేవులు చేయాలంటే కింది సూచనలు పాటించాలి 1.ఆన్లైన్ చెల్లింపులను పరిమితంగా ఉపయోగించండి 2.నమ్మకమైన మరియు సురక్షితమైన వెబ్సైట్లో మాత్రమే లావాదేవులు చేయండి 3.డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వివరాలు సివివి నంబర్లు మరియు పాస్వర్డ్ లను ఎవరికి పంచుకోకండి 4.సోషల్ మీడియాలో లేదా తెలియని లింకుల ద్వారా మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఇవ్వద్దు 5.ఏదైనా అనుమానస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించండి. ఏఐ సాంకేతికత మన ఆర్థిక భద్రతకు ఒక బలమైన రక్షణగా మారుతుంది మనమంతా జాగ్రత్తగా ఉండి సురక్షితమైన ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం కు 900 మంది వివిధ రాష్ట్రాల నుండి మరియు దేశాల నుండి పాల్గొని ఏఐ సాంకేతికతను తెలుసుకోవడం జరిగినదని విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డా. డి. రమణ రెడ్డి, తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు ఎక్కువ మోతాదులో రెస్పాన్స్ రావడం వలన ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణ రెడ్డి ని సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్ తో సత్కరించారు.ఈ కార్యక్రమం డా. జె. మహేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ & డీన్ FDP, మరియు వి.ఆర్. రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, FDP కోఆర్డినేటర్గ వ్యవహరించి ఇద్దరు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. యాజమాన్యం శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి వీరిని అభినందించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: