Sunday, 13 September 2026 11:04:35 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రెండేళ్ల పాలనలో తంబళ్లపల్లె 853 కోట్ల అభివృద్ధి తో పరుగులు - ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి

Date : 24 June 2026 08:05 AM Views : 365

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 23 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో గత రెండేళ్ల ప్రభుత్వ పాలనలో 853 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పరుగులు పెడుతున్నట్లు తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ప్రభుత్వ రెండేళ్ల పాలన పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని ఆరు మండలాలలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమగ్రంగా వివరించారు. అన్నదాత సుఖీభవ 44867 మంది రైతులకు రూ 84.48 కోట్లు, పీఎం కిసాన్ 43335 మంది రైతులకు రూ 29.25 కోట్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ, చేనేత, డప్పు కళాకారుల 26 రకాల 187611 మంది లబ్ధిదారులకు రూ 81.66 కోట్లు పెన్షన్లు, 445 గోకులం షెడ్లకు రూ55,920,62 లక్షలు, పీఎం ఏవై 1.0,2.0 లో 18 33 లబ్ధిదారులకు పక్కా ఇండ్లు పూర్తి చేసి రూ 5,17,11,539 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. తల్లికి వందనం రూ 50 కోట్లు, శ్రీ శక్తి పథకం ద్వారా రూ 16.4 కోట్లు, అభయహస్తం, తదితర పథకాలకు రూ15 కోట్లు, నియోజకవర్గంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, రహదారులకు రూ 152 కోట్లు, జలజీవన్ మిషన్, పంచాయతీరాజ్, 2047 విజన్, జలధార-జలహారతి, ఉపాధి హామీ, ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పనులు, అంగన్వాడీల అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్, హార్టికల్చర్, సిరికల్చర్, ఇంకా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు గాను ములకలచెరువు, బి కొత్తకోట, కురబలకోట, పెద్దమండెం, పీటీఎం, తంబళ్లపల్లె మండలాలకు మొత్తం రూ 853 కోట్లు తో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. అదేవిధంగా తంబాలపల్లి నియోజకవర్గం ఎం ఎస్ ఎం యు పార్క్ నిర్మాణానికి శ్రీకారం తోపాటు భూముల రీ సర్వే తో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టా పాస్బుక్కులు పంపిణీ, నూతన పెన్షన్లకు శ్రీకారం, ప్రకృతి వ్యవసాయం,నూతనంగా జీవిజీ రాంజీ ఉపాధి పథకానికి నాంది పలుకుతున్నట్లు చెప్పారు. ఈ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికార పార్టీ శ్రేణుల సహకారం ఉందని రాబోయే భవిష్యత్తు ప్రణాళిక తో తంబళ్ల పల్లె నియోజకవర్గం అభివృద్ధికి రెట్టింపు ఉత్సాహంతో అధికారులు తమ వంతు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉషారాణి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఏవో రమణ కుమార్, ఎంఈఓ త్యాగరాజు, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప,సిడిపిఓ సుజాత, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, మండల అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డప్పరెడ్డి, తులసీదర్ నాయుడు, రామచంద్ర, బేరి శ్రీనివాసులు, వెంకట్ రెడ్డి,పురుషోత్తం, దండువారిపల్లి రమణ, నాగేంద్ర నాయుడు, కాలా నారాయణ కూటమి నాయకులు, ఐదు మండలాల ఎంపీడీవోలు, తాసిల్దార్లు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తొలుత ప్రకృతి వ్యవసాయ నవధాన్యాల ముగ్గు అధికారులను ఆకర్షించింది. అంగన్వాడీలు ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాల్, వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాలు, నానో యూరియా, పలు రకాల క్రిమిసంహారక మందులు స్టాల్ పరిశీలించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: