Saturday, 12 September 2026 01:54:17 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

వేడుకగా సాగిన మదనపల్లె ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం - ఘనంగా సన్మానించిన ప్రెస్ క్లబ్ పాత్రికేయులు

Date : 25 August 2026 12:36 AM Views : 76

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వేడుకగా సాగిన మదనపల్లె ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం - ఘనంగా సన్మానించిన ప్రెస్ క్లబ్ పాత్రికేయులు మదనపల్లె : పట్టణంలోని మార్పురి వీధి,శీనా టీ స్టాల్ వద్ద ఆదివారం నూతన మదనపల్లె ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నిర్వాహకులు శ్రీరామ్ చినబాబును ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమన్నారు.ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా,వాస్తవాలను ఆధారంగా చేసుకుని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.నూతనంగా ప్రారంభమైన మదనపల్లె ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంక్షేమానికి,వృత్తిపరమైన అభివృద్ధికి వేదికగా నిలవాలని కోరుకున్నారు.ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక పాత్రికేయులు చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీరామ్ చినబాబు ప్రశంసించారు.ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రాయల్,మహబూబ్ ఖాన్,ప్రెస్ క్లబ్ నిర్వాహకులు,పలువురు పాత్రికేయులు,తెలుగు యువత నాయకులు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :