Saturday, 12 September 2026 12:08:45 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

హంద్రీ-నీవా జలాలతో తాగునీటి ట్యాంకులను నింపుతాం - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి

Date : 07 September 2026 07:52 PM Views : 48

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హంద్రీ-నీవా జలాలతో తాగునీటి ట్యాంకులను నింపుతాం - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి - చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ పరిశీలన మదనపల్లె : మదనపల్లె పరిధిలోని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం పరిశీలించారు.ట్యాంక్‌లో చేపడుతున్న పనుల పురోగతిని,పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ,హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువల సంబంధిత అధికారులను ఆదేశించారు.ట్యాంక్‌లో పేరుకుపోయిన వ్యర్థ మొక్కలు,పిచ్చి మొక్కలు తదితరాలను పూర్తిగా తొలగించి ట్యాంక్‌ను పరిశుభ్రంగా,నీటి నిలువకు అనుకూలంగా సిద్ధం చేయాలని సూచించారు.చిప్పిలి ట్యాంకులో నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచేందుకు తాత్కాలికంగా ఎత్తు పెంచే చర్యలు చేపట్టి,గత ఏడాదితో పోలిస్తే అధికంగా నీటిని నిలువ చేయాలని సూచించారు.నీరు వృథా కాకుండా షెడ్యూల్ ప్రకారం,క్రమబద్ధంగా ట్యాంకులను నింపుతూ ప్రతి మున్సిపాలిటీకి తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి చేరే హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటి అవసరాల కోసం వినియోగించడమే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.పట్టణ ప్రజలకు సురక్షితమైన,నిరంతర తాగునీటి సరఫరా అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.హెచ్ఎన్ఎస్ఎస్ నీరు ట్యాంక్‌కు చేరే సమయానికి ఎటువంటి సాంకేతిక,నిర్వహణ పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,నీటి నిల్వ,శుద్ధి మరియు మదనపల్లె పట్టణానికి తాగునీటి సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్సీ.వెంకట్రామయ్య,హంద్రీ- నీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైరల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :