నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్ అరెస్ట్ - కడప సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు - వివరాలను వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె : మదనపల్లెలో గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్‌పై జిల్లాలో రెండో వ్యక్తిగా పిట్ ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నిందితుడిపై గతంలో 18 క్రిమినల్ కేసులు ఉన్నాయని,అతడి నుంచి మొత్తం 51.915 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు.మాదకద్రవ్యాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ,డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారించాలని కోరారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం.వెంకటాద్రి,సీఐలు రాజారెడ్డి,వెంకటరమణ,ఎస్ఐలు,రామకృష్ణారెడ్డి,రహీముల్లా,సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News