Saturday, 12 September 2026 12:09:03 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన

Date : 09 September 2026 03:39 PM Views : 34

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : **నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ** నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫలమైంది. ** సంపన్న వర్గాల కోసం సామాన్యుని నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు **సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కే మురళి నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి కే మురళి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం సామాన్యుల పైన ఆర్థిక భారం మోపుతున్నారని,నిత్యవసర సరుకులు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని,సామాన్యుల జీవన విధానం అగమ్యగోచరంగా మారిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ,ప్రజలకు నిత్యం వంటగదిలో వాడే ఉప్పు,పప్పు,నూనె,ఎర్రగడ్డ,తెల్లగడ్డ,చక్కె వంటి వంటకు ఉపయోగించే నిత్యవసర సరుకులు పైన అధికంగా రేట్లు పెంచడం దుర్మార్గం అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో నిత్యవసర సరుకులు,పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వర్గాలకు కోట్ల రూపాయలు రాయతీలు ఇచ్చిదేశంలో ప్రజలను బికారీలుగా మార్చేశారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను మరచిపోయి కేంద్రం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థించుకుంటూ,ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతున్నాదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని,పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తుమలప్ప, ముని రెడ్డి,చలపతి,శ్రీనివాసులు, తరుణ్ నవ్య తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :