Sunday, 13 September 2026 04:44:15 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి - కలెక్టర్ నిశాంత్ కుమార్

చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నింపుదల పై కార్యాచరణ రూపొందించండి - కలెక్టర్

Date : 25 May 2026 07:36 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి జిల్లాలో జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నింపుదలపై ప్రత్యేక దృష్టి అన్నమయ్య జిల్లాలో రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరుల పెంపు దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ప్రత్యేక అధికారులు, డ్వామా, ఇరిగేషన్, సాగునీటి శాఖ ఏఈలు, ఏపీడీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జల వనరుల పరిరక్షణ, వర్షపు నీటి నిల్వ, ప్రవాహాల మళ్లింపు, చెరువుల పునరుద్ధరణ అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది సాధారణం కంటే సుమారు ఐదు శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే పలు మండలాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయని, రానున్న రోజుల్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గత ఏడాది నీటి మట్టాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈసారి భూగర్భ జలాల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న తొలి వర్షాలను చెరువులు, కుంటలు, ఎంఐ ట్యాంకుల్లో నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొన్ని చెరువులు ఇప్పటికే 20 నుంచి 25 శాతం వరకు నిండటం సానుకూల పరిణామమన్నారు. ప్రధాన నదుల్లో పూర్తి స్థాయి ప్రవాహాలు ప్రారంభమయ్యే వరకు చిన్న వాగులు, స్ట్రీమ్స్, సీజనల్ వాటర్ ఛానల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వృథాగా వెళ్లిపోతున్న నీటిని చెరువులు, ట్యాంకులు, రిజర్వాయర్లకు మళ్లించడం ద్వారా తాగునీరు, సాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంటూ ఫీడర్, లింక్ ఛానల్స్ అభివృద్ధి ద్వారా వరుసగా పలుచెరువులు నింపే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ప్రధాన వాగులు, వాటి ప్రవాహ సామర్థ్యంపై పూర్తి స్థాయి మ్యాపింగ్ సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో తాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పెంపు, సాగునీటి భద్రత దృష్ట్యా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమన్వయంతో పని చేస్తే ఈ ఏడాది జల వనరులను గణనీయంగా పెంచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఆర్డీవో శ్రీనివాస్, రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్సీ వెంకట్రామయ్య, ఎంపీడీవోలు, డ్వామా, ఇరిగేషన్, సాగునీటి శాఖ ఏఈలు, ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: