నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 12 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, కడప వారి ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె పట్టణంలోని రెడ్డప్ప నాయుడు కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొని భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. “మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.”
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. సహజసిద్ధమైన రంగులతో తయారు చేసిన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందన్నారు. వినాయక చవితి సందర్భంగా రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణహిత పద్ధతుల్లో మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని సబ్ కలెక్టర్ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ. సుధా, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News