నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన పురుం వెంకటరమణ - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కైవసం - ప్రదానం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా,జిల్లా కలెక్టర్ మదనపల్లె : మదనపల్లి పట్టణంలోని వివేకానంద మునిసిపల్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పురుం వెంకటరమణ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చారని,ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఎంపిక చేయగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మదనపల్లి పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అవార్డును ఆయన ప్రదానం చేశారు.ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాలుగా ఇంగ్లీష్,సోషల్ స్టడీస్ సబ్జెక్టులను పదవ తరగతి విద్యార్థులకు భోధించి డివిజన్ స్థాయిలో అనేకసార్లు ప్రథమ స్థానంలో నిలిపి,హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రెండుసార్లు పదోతరగతి ఫలితాల్లో పాఠశాలను మొదటి స్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.రాత్రి తొమ్మిది వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అదనంగా ఎన్.ఎం.ఎం.ఎస్ లో అటు రాష్ట్ర,జిల్లా స్థాయిలో అనేకసార్లు ఉత్తమ ఫలితాలు సాధించారని గుర్తుచేశారు.కరోనా సమయంలో దాతల సహకారంతో చనిపోయిన 23 మంది చేనేత కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం,అలాగే వందల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసి దాతృత్వం చాటుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు.తాను పని చేస్తున్న పాఠశాలలో మౌలిక వసతుల కోసం ప్రజా ప్రతినిధులతోనూ మరియు అధికారులుతోను సత్సంబంధాలు కలిగి ఉండి వారి సేవలు పాఠశాలకు ఉపయోగపడినట్లు కృషిచేసి అటు ఉపాధ్యాయులకు ఇటు చేనేత కార్మికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి అండగా పురం వెంకటరమణ నిలుస్తున్నారన్నారు.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని,భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ సుబ్రహ్మణ్యం,సమగ్ర శిక్ష ఏపిసి నున్నా అనురాధ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Reporter
Namitha News