నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 05 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు యన్.ఎస్.ఎస్. విద్యార్థులతో కలిసి ఎస్.వి.ఎస్. చారిటబుల్ ట్రస్ట్, తిరుపతి మరియు మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంకు వారి ఆద్వర్యంలో రక్త దాన శిభిరము కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రక్త దానము చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు అవసరం అన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్పదానం. ఇదొక నిస్వార్థమైన చర్య, సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా. రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్నే దానం చేయాలి. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అని అన్నారు. గణాంకాల ప్రకారం. మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరం అవుతుంది. ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ పరిస్థితులలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోతున్నారని, అటువంటి పరిస్థితి కలగకుండా ఉండాలంటే యువత ముఖ్యంగా సామాజిక బాధ్యత తో మెలిగి ఆపద సమయంలో ఎదుటివారికి సహాయం చేయాలని తెలిపారు. కానీ అర్హులైన వారిలో కేవలం 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. వాస్తవానికి రక్తదానం చేయడం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తి తో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు అని అన్నారు. సుమారు 120 మంది రక్త దానం చేసారు. ఈ కార్యక్రమము లో మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంకు ప్రతినిధి బాల చంద్ర నాయుడు, డాక్టర్ హరి కుమార్, మెడికల్ ఆఫీసర్, యూనివర్సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చెన్నయ్య యెన్ ఎస్ ఎస్ ఆఫీసర్ పి.రాజేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News