Sunday, 13 September 2026 03:45:53 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

కార్మికుల సమస్యల పరిష్కారానికి దిగివచ్చిన అధికారులు

సమసిన పారిశుధ్య కార్మికుల సమస్య - రెండు రోజుల్లో వేతనాలు చెల్లింపులు

Date : 04 June 2026 08:08 AM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 03 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు సమ్మెకు దిగడంతో తంబళ్లపల్లెలో పారిశుద్ధ్యం స్తంభించింది. ఈ సమస్యపై వార్త పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు ప్రచురితవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో మండల అధికారులు దిగి వచ్చారు. బుధవారం తంబళ్లపల్లె టిడిపి నాయకులు రామచంద్ర, గంగుల్ రెడ్డి, పురుషోత్తం, నరసింహులు, రెడ్డప్ప, ఐసుల కృష్ణలు మూడు మాసాలుగా జీతాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా బతకాలని అధికారులను నిలదీసి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, మరమ్మత్తుల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో ఎం వి ప్రసాద్, ఏవో థామస్ రాజా లు పారిశుధ్య కార్మికులతో చర్చలు జరిపి జీతాలు చెల్లించడానికి రెండు రోజులు గడువు కావాలని కొత్త ఎంపీడీవో తో చెల్లింపుకు ఏర్పాటు చేస్తామని సర్ది చెప్పి తంబళ్లపల్లెలో ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం పనులు చేపట్టాలని సూచించారు. టిడిపి నాయకులు, అధికారుల సూచనలతో పారిశుద్ధ్య కార్మికులు శాంతించి ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదని మా కడుపు కాలి ఈ చర్యకు దిగామని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా తమ విధులు నిర్వహిస్తామని కార్మికులు మస్తాన్, పద్మావతి, ఖాదర్ బాషా బృందం ఒప్పుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై ఏవో మాట్లాడుతూ తంబళ్లపల్లె పారిశుద్ధ్య కార్మికులు, పంప్ ఆపరేటర్లు జీతాలతో పాటు వారికి చెల్లించాల్సిన మొత్తం మరమ్మత్తుల బిల్లులు చెల్లించడానికి చర్యలు చేపట్టామని హామీ ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :