Sunday, 13 September 2026 06:54:46 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

హోటళ్ళలో రోజు టిఫెన్ తింటున్నారా..ఇక మీ సంగతి అంతే ..!

ఆనారోగ్యానికి కేరాఫ్‌ గా మారుతున్న పుంగనూరు టిఫిన్ సెంటర్లు..

Date : 22 June 2026 08:54 PM Views : 126

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా,పుంగనూరు లో ఆలస్యం గా వెలుగు చూసిన ఘటన కు సంబదించిన వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని ఎం.బి.టి రోడ్డులో మసీదుకు ఎదురుగా ఉన్న అల్పాహార హోటల్‌లో బాబు అనే వ్యక్తి రెండు దోసెలను మంగళవారం రాత్రి కొనుగోలు చేశాడు. ఈ దోసెలను హోటల్‌ వారు ప్లాస్టిక్‌ కవర్లలో వేసి ప్యాక్‌ చేసి ఇచ్చారు. ఇంటికి చేరుకుని తిందామని పొట్లం విప్పి చూడగా దోసెలు కవర్లపై ఉన్న కెమికల్‌ రంగుతో మారిపోయింది. తినలేక పడేయాల్సి వచ్చింది. హోటల్‌ యజమానిని అడుగుగా దురుసుగా సమాధానం ఇచ్చాడన్నాడు.ఆరోగ్య రక్షణ లో భాగంగా ఆహార పదార్థాలలో ప్లాస్టిక్‌ వినియోగంతో కెమికల్స్ రావడంపై బాధితుడు మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి కి ఫిర్యాదు చేశారు. ఆయన ఆహారానికి సంబంధించి తమ పరిధిలో లేదని ,అన్నమయ్య జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుడు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వారు పుంగనూరు అన్నమయ్య జిల్లా పరిధిలోకి రాలేదని , చిత్తూరు వారిని సంప్రదించాలని సూచించారు. దీనిపై బాధితుడు చిత్తూరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అక్కడి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురులక్ష్మీ స్పందించి ప్లాస్టిక్‌ వినియోగం మున్సిపాలిటి పరిధిలోకి వస్తుందని, ఆహారంలో కల్తీలు ఉంటే తాము చర్యలు తీసుకుంటామని, దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ కు లేఖ రాస్తామని తెలిపారు. కానీ ఇది తమ పరిధిలోకి రాదంటు ఒకరిపై మరొకరు వేసుకోవడం హాస్యాస్పదం. దీనిపై బాధితుడు మాట్లాడుతూ ఆహార పదార్థాలలో ప్లాస్టిక్‌ వినియోగంతో ప్రజలు ఆనారోగ్యం భారీన పడతారని , ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వని కమిషనర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసి , న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. పుంగనూరు పట్టణంలో మున్సిపల్టి అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరు తో టీ దుకాణలు,హోటల్ లలో తనిఖీ లు నిర్వహించినప్పటికీ .భోజన శాలలో విరివిగా ప్లాస్టిక్‌ వినియోగం జోరుగా సాగుతోంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ విక్రయాలు సాగుతున్న అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేస్తున్నారు. ఆహార పదార్థాలకు కవర్ల పై ఉన్న కెమికల్‌ రంగు దోసె, ఇడ్లీలలో అతుక్కుని రంగు మారి వాటిని ప్రజలు తినడంతో తీవ్రమైన ఆనారోగ్యానికి గురౌతున్నారని, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్లాస్టిక్‌, కవర్ల వినియోగాన్ని అధికారులు ఎందుకు నిర్ములించలేక పోతున్నారు అన్న దానిపై ప్రజలు అందరు అలోచించాల్సి ఉంది.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :