Wednesday, 29 July 2026 05:25:58 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ యూనివర్సిటీ యం.బి.ఏ. విద్యార్థుల తల్లితండ్రులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశం

Date : 03 January 2026 10:01 PM Views : 199

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 03 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎం.బి. ఏ) విభాగం వారు ఎం.బి.ఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు యూనివర్సిటీ అధ్యాపకుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శ్రీమంత బసు, డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి ల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ నందు విద్యార్థులకు క్రమశిక్షణ, డ్రెస్సింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫారిన్ లాంగ్వేజ్ తదితర అంశాలపైన ప్రతి రోజు శిక్షణ తరగతులు అందిస్తున్నమని, అధ్యాపకులు విద్యార్థుల పట్ల కొన్ని సార్లు కఠినంగా వ్యవహరించడం కూడా వారు ఉన్నత స్థాయిలో ఉండాలనే విషయాన్ని తల్లితండ్రులు అర్థం చేసుకోవాలని అన్నారు. యూనివర్సిటీ నందు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి వారంలో 3రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీని వలన వారికి ఉద్యోగ అవకాశల కోసం చాలా ఉపయోగ పడుతుందని తెలిపారు. అదే విదంగా మీ పిల్లలు ఎలా చదువుతున్నారు,వారి హాజరు శాతం, వారికి యూనివర్సిటీ నందు కలిపిస్తున్న మౌళిక సదుపాయాలు గురించి మీకు తెలిచేయడం కోసమే ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ప్రిన్సిపాల్ పి. రామనాథన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మా బాధ్యత ఎంత ఉందో తల్లి, తండ్రులకు అంతే బాధ్యత ఉందని, యూనివర్సిటీలో చదువు పూర్తి అయిన ప్రతి విద్యార్ధి కూడా ఏదో ఒక ఉద్యోగంతో బయటకు వెళ్ళాలనే మంచి ఉదేశ్యంతో యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయభాస్కర్ చౌదరి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎం. బి. ఏ. డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, , కో ఆర్డినేటర్స్ డాక్టర్ గీత దేవి, డాక్టర్ జ్ఞాన ప్రసూన , అధ్యాపకులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. .

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :