Thursday, 16 April 2026 06:51:39 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఉపాధి హామీ చట్టం ను పునరుద్దరణ చేయాలని ఉద్యమం కు సన్నద్ధం కండి - సిపిఐ కృష్ణప్ప

ఫిబ్రవరి 01 నుండీ 9వ తేదీ వరకూ గ్రామాల్లో నిరసన కు పిలిపునిచ్చిన సీపీఐ

Date : 29 January 2026 09:57 PM Views : 83

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 28 : గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు ఉద్యమం లాగా ఫిబ్రవరి 1 నుంచి 9 గ్రామంలో ప్రచారాలు ఆందోళనలు జయప్రదం చేయాలని నేడు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్పలు పాల్గొని మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరణకు సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కలిసి ఆందోళన కార్యక్రమాలు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామాలలో ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేద కూలీలను ఉపాధి కూలీలను చైతన్యవంతం చేసి ఉపాధి చట్టాన్ని రక్షించుకోవడానికి ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని దేశంలోనే మొదటిగా వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా 2005 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నిర్వహించడానికి ఆకలి చావులు ఆత్మహత్యలు పేదరికం కటిక దారిద్రం నుండి ఉపశమనం కల్పించడానికి ప్రతి కూలీకి పని కల్పించాలని ఉద్దేశంతో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ చట్టానికి నిధులు కోత విధిస్తూ చట్టాన్ని తోట్లుబడుస్తూ ఇందులో ఉపాధి హామీ కూలీలకు నష్టం చేసే విబిజి రామ్ జి‌ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని ఈ దేశంలో 27 కోట్ల మంది కుటుంబాలు ఈ చట్టం వల్ల ఉపాధి లభిస్తుంది అయితే ప్రస్తుతం కొత్త చట్టం వల్ల కేంద్రం 90 శాతం ఉన్న వాటాను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపి కూలీలకు ఉపాధి కల్పనకు జాబు కార్డులు ఇవ్వకుండా ఆధారాన్ని సంధానం ఈ కేవైసీ పేరుతో కూలీలను కుదిస్తున్నారని చేసిన కూలి పనులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నాదని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామాలలో ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామీణ ప్రజలను ఉద్యమాలకు సన్నద్ధం చేస్తామని అలాగే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఎకరం 99 పైసలకు ఇస్తామని అవసరమైతే ఎంతైనా ఇస్తామని రాష్ట్ర సమాచార మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న మిగులు భూములు ప్రజలువని అది పేదలకు రైతులకు దక్కాలని మీ తాత సంపాదించిన రెండెకరాల భూమిని పైసా కి ఇవ్వు కానీ ప్రభుత్వ భూములు అప్పనంగా అప్పజెప్పితే తస్మా జాగ్రత్త ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు గత రెండు రోజులుగా రైల్వే కోడూర్ నియోజకవర్గ జనసేన పార్టీ శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పై ప్రభుత్వ ఉద్యోగి మహిళ చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి నిజా నిజాలు నెగ్గుదల్చాలని వారు కోరారుఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే మురళి సిపిఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ లు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :