Monday, 14 September 2026 08:01:03 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె టిడిపి అధ్యక్ష పీఠం పై పీఠముడి - టీడీపీ ఐ వి ఆర్ సర్వేలో ముగ్గురు పోటీ

ఇద్దరు బిసి, ఓసి పోటా పోటీ

Date : 21 December 2025 06:40 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 21 : తంబళ్లపల్లె మండల అధ్యక్ష పీఠం పై అధిష్టానం జాప్యం చేయడంతో పీట ముడి పడింది. తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం తో పాటు ఎమ్మెల్యే స్థానికంగా ఉండి వైకాపా బలంగా ఉండే మండలంలో టిడిపి అధ్యక్ష పీఠం ఆర్థిక, అంగ, బలమైన వర్గం కలిగిన నాయకుడి ని ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై పార్టీ మండల అధ్యక్ష పీఠానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఐవిఆర్ సర్వే సైతం నిర్వహించింది. మండల అధ్యక్ష, గ్రామ కమిటీ అధ్యక్ష ఎన్నికలు మాజీ టిడిపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి సారధ్యంలో జరిగాయి. అనంతరం మరోమారు అబ్జర్వర్లు కొన్ని గ్రామ కమిటీలను మార్చడం పై పార్టీలో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ మధ్య మల్లయ్య కొండ కింద అధ్యక్ష ఎన్నిక కోసం 12 మంది పోటీ పడడం గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. గత ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొని కష్టపడిన కార్యకర్తలు ఎవరికి వత్తాసు పలకాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఓవైపు వైకాపా రోజురోజుకు తంబళ్లపల్లె లో బలం పుంజుకున్నట్లు తమ కార్యక్రమాలతో బల ప్రదర్శన చేస్తున్నారు. తంబళ్లపల్లెలో వైకాపాను ఎదుర్కోవాలంటే ఎలాంటి విమర్శలు లేకుండా ఆర్థిక, అంగ, వర్గం కలిగి నిస్వార్ధంగా తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా ఎవరిని నియమించినా పార్టీకి కష్టపడే నాయకుడిని నియమిస్తే తంబళ్లపల్లెలో టిడిపి కి పూర్వ వైభవం ఖాయం. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టిడిపి అధిష్టానం భేషజాలకు వెళ్లకుండా ఏ నాయకుడిని మండల అధ్యక్షునిగా ఎంపిక చేసినా కష్టకాలంలో పని చేసి నష్టపోయి విసిగి పోయిన మెజారిటీ కార్యకర్తలు ఏకాభిప్రాయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధిష్టానం మీ నమేషాలు లెక్కించకుండా వర్గ పోరు లేకుండా అందరిని కలుపుకొని పోరాట పటిమ కలిగిన నాయకుడిని ఎంపిక చేసి తంబళ్లపల్లె అధ్యక్ష పదవి ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల రణ రంగానికి సిద్ధం కావాల్సి ఉంది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :