నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు - ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలు పంపిణి మదనపల్లె : మదనపల్లెలో మత సామరస్యానికి,పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ఖాన్ ఫౌండేషన్ ఆదర్శంగా నిలుస్తోంది.వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని,ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అనవాయితీగా నిర్వహిస్తున్న పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలు,మొక్కల పంపిణి ఈ ఏడాది కూడా నిర్వహించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.ఏపీ ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్,తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు,విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,ఆర్టీసీ ఈయు 1,2 డిపోల గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి,టిడిపి సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్,రాటకొండ మధుబాబు, బాబు నాయుడు,అయూబ్ ఖాన్,బావాజాన్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రజలకు ప్రకృతిని కాపాడుకుందాం,పర్యావరణాన్ని పరిరక్షిస్తూ,భక్తి,బాధ్యత రెండింటినీ చాటి చెబుతూ ఉచితంగా వినాయక విగ్రహ ప్రతిమలను పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా భక్తిభావంతో పఠాన్ ఖాదర్ ఖాన్ ప్రతి ఏటా ఆనవాయితీగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహ ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు.నేడు పర్యావరణం సమతుల్యత దెబ్బతిని ప్రకృతి క్షీణిస్తున్న నేపథ్యంలో తిరిగి మొక్కలను పెంపొందించాలన్న సదుద్దేశంతో విత్తనాలతో కూడిన గణపతిని మరియు మొక్కలను ఇవ్వడం మూలంగా కొత్త మొక్కలు నాటడం నిమజ్జనం చేసిన గణపతి ప్రతిమల నుంచి కొత్తమొక్కలు మొలచి ప్రకృతిని కాపాడడానికి దోహదపడేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు.భవిష్యత్తు లో ఖాదర్ ఖాన్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరింత మెరుగైన సేవలను పెద్దఎత్తున అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,అభిమానులు,కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Reporter
Namitha News