Sunday, 13 September 2026 08:01:05 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఖరీఫ్ రైతులకు శుభవార్త - పంటల కనీస మద్దతు ధరలు పెంపు

రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు

Date : 13 May 2026 10:25 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - మే 13 : దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయమని ఆయన అభినందించారు. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతం లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఖరీఫ్ పంటల MSP పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల 60 వేల కోట్ల భారీ వ్యయాన్ని ఆమోదించడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పెట్టుబడి ఖర్చుకు కనీసం 50 శాతం లాభం జోడించి MSP ధరలు నిర్ణయించడం రైతులకు నిజమైన భరోసా కల్పించే చర్యగా అభివర్ణించారు. రైతు కష్టానికి తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతోనే పలు పంటల MSPలను గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు. వరి కామన్ రకానికి క్వింటాల్‌కు రూ.72 పెంచి రూ.2441, గ్రేడ్-ఏ వరికి రూ.2461 నిర్ణయించడం రైతులకు లాభదాయకమని తెలిపారు. జొన్నకు రూ.4073, రాగికి రూ.5205, స‌జ్జ‌లకు రూ.2900, ఉలవలకు రూ.8200, మొక్క‌జొన్న‌కు రూ.2410, నువ్వులకు రూ.10,346, సన్‌ఫ్లవర్‌కు రూ.8343, పత్తికి రూ.8667, వేరుశ‌న‌గ‌కు రూ.7517 వరకు MSP పెంపు ప్రకటించడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వ్యయభారం, ఎరువులు, విత్తనాలు, కార్మిక ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు. రాష్ట్రంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన MSPలను పూర్తిస్థాయిలో పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ వ్యవస్థ, మద్దతు ధర అమలు ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతాంగానికి అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలకు రాష్ట్ర రైతుల తరఫున మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :