Thursday, 30 July 2026 08:28:13 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

చేనేతలను విస్మరించిన కూటమి ప్రభుత్వం

చేనేతలను ఆదుకోని కూటమి ప్రభుత్వం అంటూ ఏద్దేవా - వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్

Date : 18 July 2026 02:35 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూలై 18 : నేతన్నల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిరంతర భరోసా కల్పిస్తే, కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా చేనేత కుటుంబాలను పూర్తిగా విస్మరించిందని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్, పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. జగన్ ప్రభుత్వం 2019-20 నుంచి 2023-24 వరకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రతి అర్హతగల చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదు విడతల్లో మొత్తం రూ.1.20 లక్షలు అందించిందన్నారు. సుమారు 80 వేల కుటుంబాలకు రూ.969.77 కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి దేశంలోనే ఆదర్శ సంక్షేమ పథకంగా నిలిపిందన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేతన్న నేస్తం అమలు ఆగలేదని గుర్తు చేశారు. ఎన్నికల ముందు జగన్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తామని, అంతకంటే మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తాన్ని నిలిపివేశారని ఆరోపించారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో ప్రతి అర్హతగల నేతన్న కుటుంబం రూ.48 వేల మేర నష్టపోయిందన్నారు. ఇప్పుడు నేతన్న భరోసా పేరుతో రూ.25 వేల సాయం ఇస్తామని ప్రచారం చేస్తూ, రెండేళ్లుగా ఇవ్వాల్సిన రూ.48 వేల బకాయిని పూర్తిగా దాచిపెడుతున్నారని విమర్శించారు. జగన్ ఇచ్చిన రూ.24 వేలపై కేవలం రూ.1,000 పెంచామని చెప్పడం కంటే ముందు, రెండేళ్లుగా నిలిపివేసిన సాయాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో 80,686 కుటుంబాలు లబ్ధి పొందగా, ప్రస్తుతం కేవలం 54 వేల మందినే అర్హులుగా గుర్తించడం దారుణమన్నారు. ప్రభుత్వం మరోవైపు రాష్ట్రంలో 93 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయని చెబుతూనే, నగదు సాయానికి మాత్రం 54 వేల మందినే ఎంపిక చేయడం ఏ విధమైన భరోసా అని ప్రశ్నించారు. మగ్గం, విద్యుత్ కనెక్షన్, జియో ట్యాగింగ్, వృత్తి ధ్రువీకరణ వంటి కొత్త నిబంధనల పేరుతో నిజమైన నేతన్నలను పథకం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. నిజంగా నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమైతే, 2024-25 మరియు 2025-26 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలతో కలిపి ప్రతి అర్హతగల నేతన్న కుటుంబానికి రూ.50 వేల చొప్పున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. *జగన్ హయాంలో నేతన్న నేస్తం అమలు* ఆర్థిక సంవత్సరం లబ్ధిదారుల కుటుంబాలు ఒక్కో కుటుంబానికి విడుదల చేసిన మొత్తం 2019-20_ 79,000 రూ.24,000 రూ.189.53 కోట్లు 2020-21_ 81,024 రూ.24,000 రూ.194.46 కోట్లు 2021-22_ 80,032 రూ.24,000 రూ.192.08 కోట్లు 2022-23_ 80,546 రూ.24,000 రూ.193.31 కోట్లు 2023-24_ 80,686 రూ.24,000 రూ.193.64 కోట్లు *మొత్తం ఐదు విడతల్లో:* ఒక్కో కుటుంబానికి: రూ.1.20 లక్షలు మొత్తం విడుదల: సుమారు రూ.969.77 కోట్లు ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేతన్న భరోసా ఎందుకు ఇవ్వలేదు? 2025 ఆగస్టులో రూ.25 వేల సాయం ప్రకటించి, ఏడాది గడిచినా ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు ప్రకటిస్తున్న రూ.25 వేల సాయం ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది? గత రెండేళ్లకు సంబంధించిన రూ.48 వేల బకాయిని ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? జగన్ ప్రభుత్వంలో 80,686 కుటుంబాలకు సాయం అందితే, ఇప్పుడు కేవలం 54 వేల మందినే ఎందుకు ఎంపిక చేశారు? ప్రభుత్వం చెప్పిన 93 వేల చేనేత కుటుంబాల్లో మిగిలిన దాదాపు 39 వేల కుటుంబాలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది.? అని విజయ భాస్కర్ కూటమి ప్రభుత్వంపై ద్యాజమెత్తరు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పురం హరినాద్.పట్టణ చేనేత అధ్యక్షుడు పురం శ్రీరాములు, పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :