Wednesday, 29 July 2026 10:16:50 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మహిళల భద్రతకు శక్తి యాప్ ఓ కవచం - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

యాప్‌లోని SOS బటన్ లేదా డయల్ 112 ద్వారా ఫిర్యాదు చేసిన కేవలం 10 నిమిషాల్లోనే రక్షణ

Date : 17 January 2026 10:08 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 17: జిల్లాలోని మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆపద సమయంలో వారికి అండగా నిలిచేందుకు ‘శక్తి’ యాప్ ఒక అద్భుతమైన ఆయుధమని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘శక్తి’ టీం బృందాలు శనివారం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆపదలో అభయహస్తం.. 10 నిమిషాల్లోనే రక్షణ! మహిళలు తమ రక్షణ గురించి భయపడాల్సిన అవసరం లేదని, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ, బాలిక 'శక్తి' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని శక్తి టీం సభ్యులు సూచించారు. యాప్‌లోని SOS బటన్ లేదా డయల్ 112 ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే, కేవలం 10 నిమిషాల్లోనే సంబంధిత పోలీస్ అధికారులు ఆపదలో ఉన్న వారి వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చారు.

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు లేదా వేధింపుల ఎదురైనప్పుడు ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు ????అత్యవసర సాయం: 112 ????మహిళా వేధింపులు: 1091 ????గృహ హింస: 181 ????చైల్డ్ లైన్: 1098 ????సైబర్ నేరాలు: 1930 ????సైబర్ మిత్ర లేదా స్థానిక పోలీసులను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరూ ప్లే స్టోర్ నుండి 'శక్తి' యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ వ్యక్తిగత వివరాలు మరియు ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సమాజంలో మహిళల భద్రత పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిరంతరం కొనసాగుతాయని ‘శక్తి’ టీం సిబ్బంది తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :