Sunday, 13 September 2026 07:47:33 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత

మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గా ప్రమాణస్వీకారం లో శ్రీరామ్ చినబాబు

Date : 16 June 2026 04:47 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 16 : మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడిగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆద్య అంతమూ అట్టహాసంగా జరిగిన పదవీ స్వీకారం మహోత్సవం లో పాల్గొన్న పలువురు ప్రముఖులు గతం కంచర్ల అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, మాజీ సైనికులు మరియు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కంచర్ల శ్రీనివాసులు నాయుడు తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, మాజీ సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ సైనికుల మధ్య ఐక్యతను పెంపొందించి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొని, నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా జరిగింది. కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం కు హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ శ్రీనివాసులు పదవి లేకపోయినా మాజీ సైనికులకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పదవి మరింత బాధ్యతతో నిర్వహిస్తూ మాజీ సైనికుల కుటుంబసభ్యుల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియచేసిన శ్రీరామ్ చినబాబు. ఈ సందర్భంగా ఆత్మీయ అభినందనలు తెలిపిన స్థానిక తెలుగుదేశం నాయకులు మెహబూబ్ ఖాన్, శ్రీనాథ్, హేమంత్, అశోక్, శ్యామ్, రాజు, సురేష్, సునీల్ రెడ్డి, అరుణ్, బీజేపీ నాయకులు శ్రీకాంత్, రమేష్,వెంకటేష్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: