నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 07 ః ఎల్ నినో ప్రభావం తో వర్షాలు లేక ఎండిన పంటలను శుక్రవారం వ్యవసాయ అధికారి రమణ కుమార్ ఆధ్వర్యంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నుంచి కృషి విజ్ఞాన కేంద్రం, కలికిరి అగ్రి పాలిటెక్నిక్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఎద్దులవారిపల్లి, ఒక్కవారిపల్లి, జెన్నెవారిపల్లి, మూలపల్లి మరియు తంబళ్లపల్లె వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. వర్షాధారపు వేరుశనగ, కంది పంటలు పూర్తిగా దెబ్బతిని భూములు బీడు భూములు గా మారినట్లు గుర్తించారు. బోర్ల కింద సాగునీరు ఇంకిపోయి వరి పంట దాదాపు కనుమరుగైనట్లు అదే విధంగా మల్బరీ సాగు గుర్తింపు లేకుండా పోయినట్లు అంచనా వేశారు. వర్షాధారపు మామిడి తోటలు సైతం నీరు లేక ఎండుతున్నట్లు దీంతోపాటు అడవి పందుల బెడద తో ఎన్నడు లేని విధంగా పూర్తిగా పంటలు నాశనమైనట్లు రైతులు శాస్త్రవేత్తలకు వివరించారు. ఖరీఫ్ సీజన్ కు గాను ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో కందులు, ఉలవలు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు పంపిణీ చేసి అటవీ శివార్లపొలాలకు అడవి పందుల బెడద తప్పించడానికి ప్రభుత్వం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు సహకరించాలని రైతులు కోరారు. ఈ పర్యటనలో తిరుపతి శాస్త్రవేత్త డాక్టర్ కదిరి మోహన్, కలికిరి టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ హర్షవర్ధని, కలికిరి పాలిటెక్నిక్ అగ్రి విద్యార్థులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఎద్దులవారిపల్లి వి ఏ ఏలు సురేష్, రెడ్డి శేఖర్, సుధాకర్, రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News