నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 18: తంబళ్లపల్లె మండలం జుంజుర పెంటకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు తేజమూర్తి నాయుడు (65) సోమవారం బెంగళూరు లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం ఆయన మృతదేహానికి టిడిపి నాయకులు టిడిపి జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొని పార్టీ ఆవిర్భావం నుండి టిడిపికి సేవలందించిన తేజమూర్తి నాయుడు మృతి తీరని లోటని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడులను ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంత్యక్రియలలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సిద్ధమ్మ, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసిధర్ నాయుడు,కోటకొండ రెడ్డప్ప, గోపి దీన్ని చంద్ర,లక్ష్మీనారాయణ నాయుడు,నరసింహులు,పురుషోత్తం, వీరాంజనేయులు, జనసేన నరసింహులు,రమణ, తాతిరెడ్డి,నారాయణ, సామిరెడ్డి, కసెట్టి వెంకటరమణ, వందలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News