Tuesday, 15 September 2026 08:51:52 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మిట్స్ విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగం పై హాండ్స్ ఆన్ వర్క్‌షాప్

Date : 16 March 2026 09:11 PM Views : 402

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 16 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో “అమెజాన్ వెబ్ సర్వీసెస్ మరియు డాకర్ టెక్నాలజీలను ఉపయోగించి పరిశ్రమల్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగం” అనే అంశంపై హాండ్స్ ఆన్ వర్క్‌షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని అమృత విశ్వ విద్యాపీఠం స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ టెక్నాలజీలను అర్థం చేసుకొని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యాన్ని అందించే క్లౌడ్ సేవలు, డేటా సెక్యూరిటీ, బ్యాకప్ సదుపాయాలు మరియు ఆధునిక ఐటీ రంగంలో అప్లికేషన్ల అభివృద్ధికి క్లౌడ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ వర్క్‌షాప్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ సేవలు, డాకర్ టెక్నాలజీ, ఆటోమేషన్ విధానాలు, అప్లికేషన్లను క్లౌడ్‌లో ఎలా అమలు చేయాలి మరియు వాటిని ఎలా కలపాలి (ఇంటిగ్రేషన్) వంటి విషయాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. క్లౌడ్ ఆధారంగా అప్లికేషన్లు ఎలా తయారు చేయాలి, ఎలా నిర్వహించాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆధునిక ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేవ్‌ఓప్స్ మరియు కంటైనర్ టెక్నాలజీలపై నైపుణ్యాలు పెంపొందించుకుంటే భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్. కల్పన, కోఆర్డినేటర్లు ఎ. నాగ లక్ష్మి, ధనలక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :