Wednesday, 29 July 2026 09:13:38 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ యూనివర్సిటీ లో ట్యాలీప్రైమ్ అనే అంశంఫై ఐదు రోజుల పాటు హాండ్స్ ఆన్ ట్రైనింగ్

Date : 09 December 2025 05:46 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 09 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టూబి యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు ట్యాలీప్రైమ్ అనే అంశంఫై ఐదు రోజుల పాటు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఎం.బి.ఏ (ఫైనాన్స్) చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మదనపల్లెలోని గుడ్ విల్ ట్యాలీ అకాడమీ ట్రైనర్ ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ట్యాలీ ప్రైమ్ నేటి డిజిటల్ యుగంలో వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు అకౌంటింగ్ పై ప్రాక్టికల్ జ్ఞానం అందించి పరిశ్రమకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. వ్యాపార సంస్థల్లో రోజువారీ లావాదేవీల నమోదు, జీ.ఎస్.టి లెక్కలు, స్టాక్, సేల్స్, పర్చేస్ వంటి అంశాల డిజిటల్ రికార్డులను సులభంగా నిర్వహించడానికి ఇది అత్యంత ఉపయోగపడుతుంది. తయారీ సంస్థల్లో ముడి సరుకుల నుండి వస్తువుల తయారీ వరకు స్టాక్ ట్రాకింగ్, ప్రొడక్షన్ ఖర్చుల లెక్కింపు, సమయానుకూల ఆర్థిక రిపోర్టుల తయారీ చేయడానికి ట్యాలీ ప్రైమ్ ఉపకరిస్తుంది. చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు తక్కువ ఖర్చుతో తమ వ్యాపార ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఇది ఒక ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోంది అని అన్నారు. ట్యాలీప్రైమ్ నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించడానికి వీలుకలుగుతుందని అన్నారు. ఐదు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ భాను శ్రీ రెడ్డి,ఫాకల్టీ కోఆర్డినేటర్స్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎన్.గంగిశెట్టి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :