నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె నుండి తిరుమలకు ప్రతి సంవత్సరం దొర చంద్రశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో 30 నుంచి 100 వంద మంది భక్తులువరకు వెళుతుంటారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ముందుండి నడిపించిన చంద్రశేఖర్ రాయల్ కు గురువారం శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ నెల డిసెంబర్ 13వ తారీకు శనివారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటరమణ దేవస్థానం నుండి వాయల్పాడు, పీలేరు, భాకరాపేట, మంగపురం, మెట్ల మార్గంలో నడిచి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం గట్టు,మదనపల్లె నుంచి తిరుమలకు వెళ్తూ ఉంటారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలిగి అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు.
Reporter
Namitha News