Sunday, 13 September 2026 05:40:34 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలే లక్ష్యం : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 02 June 2026 05:24 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 02: అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించార

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత 35 రోజుల కాలంలో పరిశ్రమల స్థాపన, విస్తరణ, రీన్యూవల్‌ల కోసం మొత్తం 27 దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిలో 16 పరిశ్రమలకు సంబంధిత శాఖలు అనుమతులు, రెన్యూవల్‌ మంజూరు చేశాయని, మరో 10 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించి అవసరమైన అనుమతులు జారీ చేయాలని పర్యావరణ పరిరక్షణ, ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి పెట్టుబడి రాయితీల కింద జిల్లాలోని ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు రూ.3.76 కోట్ల విలువైన రాయితీల మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద జిల్లాలో 74 యూనిట్లకు రూ.2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేసినట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 27 యూనిట్లకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎంఈజీపీ దరఖాస్తులను బ్యాంకులు త్వరితగతిన పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అన్నమయ్య జిల్లాను పరిశ్రమల అభివృద్ధికి అనువైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె. కృష్ణ కిశోర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వై.వి.కే. సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :