నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - మే 11 : రామసముద్రం తహసీల్దార్ కార్యాలయం లోని ప్రజా ఫిర్యాదుల స్వీకారం కార్యక్రమం లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష మండలం లోని పలు గ్రామల నుండీ వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలపై అప్పటికప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మౌకిక ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే, కొన్ని ఫిర్యాదులపై స్థానిక తహసీల్దార్ అజరుద్దీన్ కు, ఎంపీడీఓ కు మీరు స్వయంగా పర్యవేక్షణ చేసి చట్టభద్ధంగా పరిష్కరించాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్. తదనంతరం అనారోగ్య సమస్యలపై ఆర్థిక సాయం కోరుతూ ముఖ్యమంత్రి దరఖాస్తు చేసుకొన్న లబ్దిదారులకు మంజూరైన నిధులను చెక్కులను లబ్ధిదారుల కుటుంబీకులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News