నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 10 : తంబళ్లపల్లి మండలంలోని గుండ్లపల్లి ఏడాదిగా ప్రకృతి వ్యవసాయం తో నేడు ఎల్ నినో ను అధిగమించి నాలుగు రకాల పంటలతో నాలుగు రకాలుగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ ఆధ్వర్యంలో రైతులకు ఈపీఎండిఎస్ పొడి విత్తనాలు వర్షాకాలం ముందే పంపిణీ చేసి అనంతరం పంటలు సాగు చేయించారు. నేడు ప్రకృతి వ్యవసాయం ద్వారా మొక్కజొన్న, సజ్జ, కొర్ర, జొన్న పంటలకు భూసారం పెరగడం తో పాటు నీటి పొదుపు, చీడపీడలకు స్థానికంగా దొరికే ఆకుల కషాయాలు, కూలీల ఖర్చులు లేకుండా పంటలు సాగు చేసి సత్ఫలితాలు సాధించారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో రైతులు అశోక్ నాయుడు, అప్పలనాయుడు, శ్రీరాములు, విశ్వనాద్ లు ప్రథమ స్థానంలో నిలిచారు
Reporter
Namitha News