Saturday, 12 September 2026 06:23:28 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఉపాధి హామీలోపండ్ల తోటల పెంపకానికి శ్రీకారం - ఏపీవో అంజనప్ప

Date : 25 June 2026 10:48 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 25 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డ్వామా పిడి వెంకటరత్నం ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల మొక్కలు నాటే. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం మండలంలోని పంచాలమర్రి పంచాయతీలో రైతు విశ్వనాథరెడ్డి కి చెందిన ఐదు ఎకరాల పొలంలో మామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టి ఏ సుజాత లు పూజ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ మండలంలో 160 ఎకరాలలో పండ్ల తోటలు పెంపకానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యంగా కొబ్బరి చెట్లు పెంపకం పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఒక్కో రైతుకు 20 కొబ్బరి మొక్కలు నాటాలని సూచించారు. అదేవిధంగా మామిడి, నేరేడు, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, సపోటా పండ్ల మొక్కలు నాటుకోవచ్చన్నారు. మండలంలోని రైతులకు ఎన్ని ఎకరాలైనా పండ్ల మొక్కల పెంపకానికి సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా జలధార-జల హారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ పనులు వేగవంతం చేస్తున్నామని ఈనెలాఖరకు జలధార పనులు పూర్తి చేయడానికి ఉపాధి హామీ అధికారులను పురమాయించినట్టు చెప్పారు. ఆయన వెంట ఫీల్డ్ అసిస్టెంట్లు నరసింహులు, వేమనారాయణ, ఉపాధి కూలీలు, రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :