Sunday, 13 September 2026 04:48:43 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

స్వర్గీయ వైఎస్సార్ 77 వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో యువ జన విభాగం అధ్యక్షుడు హర్ష వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంల

Date : 08 July 2026 02:01 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహానేత స్వర్గీయ వైఎస్సార్ 77 వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో యువ జన విభాగం అధ్యక్షుడు హర్ష వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ... దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా మదనపల్లె సర్వబోధన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో బుధవారం పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో, వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం సేవలందించిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలు, ప్రజల పట్ల ఆయన చూపిన మానవత్వం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగుల సహాయకులు, ప్రజలకు పండ్లు, బ్రెడ్‌తో పాటు ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భయ్యా రెడ్డి, రెడ్డి భాస్కర్, పూర్ణ, రతీష్, అశోక్ రాయల్, కౌశిక్ రాజు, గోవా బ్రదర్స్, గిరీష్, దీపు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: