Saturday, 12 September 2026 02:45:46 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మొలకలదిన్నె లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ కు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సియం చంద్రబాబు

FFC కాంప్లెక్స్ శంకుస్థాపన లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 25 May 2026 06:47 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 25 : మదనపల్లి మండలం లోని మొలకలదిన్నె లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి, భూమిపూజ కార్యక్రమం లో ఎమ్మెల్యే షాజహాన్, కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్” కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం లోని మొలకలదిన్నె గ్రామంలో రూ.15.25 కోట్ల వ్యయంతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం ను సియం చంద్రబాబు విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మొలకల దిన్నె లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే షాజహాన్ బాష ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి, కొత్త పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన రాయితీలు, సబ్సిడీలు, బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీలు, పవర్ సబ్సిడీలు వంటి అంశాలపై సమగ్ర సమాచార పత్రాలను ప్రజలకు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆ సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక పరిశ్రమ స్థాపనకు పారిశ్రామికవేత్త రూ.100 పెట్టుబడి పెడితే, ప్రభుత్వం సుమారు రూ.45 వరకు వివిధ రకాల రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో అందించేలా పథకాలు రూపొందించిందని కలెక్టర్ వివరించారు. ఈ అంశాలను విస్తృతంగా ప్రచారం చేసి మరింత మందికి అవగాహన కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలంటే స్థానికంగా పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరచడంతో పాటు రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో జిల్లాలో భూసర్వే, ల్యాండ్ ఆడిట్, పొల్యూషన్ అధ్యయనాలు నిర్వహించి జిల్లాకు అనుకూలమైన పరిశ్రమలను గుర్తించే ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. జిల్లా సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు, మానవ వనరులను పరిగణలోకి తీసుకొని పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిపాలన, పారదర్శక పాలన, అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పురోగతి వంటి అంశాలు రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మదనపల్లి ఆటో నగర్‌ను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించడం చారిత్రాత్మకమని అన్నారు. ఆటో నగర్‌లో లారీ బాడీ బిల్డింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, టింకరింగ్ విభాగాలకు సమగ్ర ప్రణాళికతో స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చిన్న పారిశ్రామికవేత్తలు, కార్మికులకు అందుబాటు ధరల్లో స్థలాలు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్, ఏపీఐఐసీ అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మదనపల్లిలో త్వరలోనే 50 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మదనపల్లి ప్రత్యేక వాతావరణాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశ్రమల ప్రాంతాల్లో చేపట్టిన సుందరీకరణ పనులను ప్రజలు కాపాడాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ పి.ఎన్. మహేష్, మదనపల్లి టమోటా మార్కెట్ చైర్మన్ జంగాల శివరామ్, ఏపీఐఐసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, యువత మరియు ప్రజలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :