Sunday, 13 September 2026 09:57:25 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ ఎన్.సి.సి. ఎయిర్ వింగ్ విభాగం క్యాడేట్ లు జాతీయస్థాయి లో ప్రతిభ

Date : 06 July 2026 11:04 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 06 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎన్‌సీసీ ఎయిర్ వింగ్‌కు చెందిన క్యాడెట్ జి. రుద్ర తేజ భారత వైమానిక దళం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ అటాచ్‌మెంట్ క్యాంప్ (AFAC) ను విజయవంతంగా పూర్తి చేసి విశిష్ట ప్రతిభ కనబరిచాడని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ జాతీయ స్థాయి శిక్షణను హైదరాబాద్‌లోని డుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా క్యాడెట్ రుద్ర తేజకు భారత వైమానిక దళం కార్యకలాపాలు, యుద్ధ మరియు శిక్షణ విమానాల పరిచయం, విమానయాన సాంకేతిక అంశాలు, సైనిక క్రమశిక్షణ, నాయకత్వ వికాసం, జట్టు భావన, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ పొందారని అన్నారు. అలాగే భారత వైమానిక దళ అధికారులతో ప్రత్యక్షంగా మమేకమై వారి అనుభవాలను తెలుసుకునే అవకాశం పొందారని తెలిపారు. దేశ నలుమూలల నుండి 100 మందికిపైగా పాల్గొన్న ఈ శిక్షణలో మిట్స్ యూనివర్సిటీ క్యాడెట్ ప్రతిభ చూపడం గర్వకారణం అని అన్నారు.ఈ జాతీయ స్థాయి శిక్షణా శిబిరం ఎయిర్ ఫోర్స్ అటాచ్‌మెంట్ క్యాంప్ కమాండెంట్ వింగ్ కమాండర్ ఆర్యన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిందని ఆయన తెలిపారు. జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమంలో ప్రతిభ చూపిన క్యాడెట్ జి. రుద్ర తేజ ను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్-ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :