Tuesday, 15 September 2026 09:54:19 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం, పేద ప్రజలకు పట్టడు అన్నం పెట్టేందుకే ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం - ఎమ్మెల్యే షాజహాన్

అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిభావ దినోత్సవ వేడుకలు

Date : 29 March 2026 08:31 PM Views : 235

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 29 : మదనపల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పలు గ్రామాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాష ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉదయం 8 గంటలకే జెండా ఆవిష్కరణలతో ప్రారంభమైన 44వ వార్షికోత్సవ వేడుకలు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించబడ్డాయి... 13 చోట్ల తెలుగుదేశం శ్రేణులు నిర్వహించిన జెండా ఆవిష్కరణలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని కార్యకర్తలతో కలిసి సందడి చేశారు.. జెండా ఆవిష్కరణతో పాటు కేకులు కట్ చేసి కార్యకర్తలకు స్థానిక ప్రజలకు పంచిపెట్టారు.. పెద్ద ఎత్తున నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో మదనపల్లి పట్టణం పసుపుమయం అయింది... 1982 నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్తలను ఎమ్మెల్యే షాజహాన్ భాష శాలవలతో సత్కరించి, అభినందించారు.. అనంతరం పారడైజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ లు నిర్వహించిన కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు.. రాష్ట్ర నాయకత్వం ఎంపిక చేసిన 19 మంది కార్యకర్తలతో పాటు.. సైకిల్ లు టోపీలు బహుమతిగా పొందిన కార్యకర్తలను శాలవలతో సత్కరించారు... ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం సామాన్య ప్రజల కష్టాలను తీర్చేందుకే తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించారని.. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడ్డారని తెలిపారు.. భారతదేశంలోనే సంక్షేమాన్ని మొదట మొట్టమొదటగా అందించిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు.. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్ర రాజధాని లేక అవమానం పొందిన తెలుగు ప్రజల కోసం అమరావతి రాజధానిగా పునర్నిర్మానం చేపట్టారని, ఆంధ్రుల జీవనాడి పోలవరం పనులను వేయగవంతంగా నడిపిస్తున్నారని, అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి అనేలా ప్రపంచం గర్వించే విధంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.. పార్టీకి కష్టకాలంలో సేవలందించి వాటిని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.. పార్టీ కోసం పనిచేస్తున్న వందలాది మంది కార్యకర్తలను శాలవలతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ టౌన్ బ్యాంక్ చైర్మన్ నదిల్ల విద్యాసాగర్, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గంగారపు నవీన్ చౌదరి, మాజీ మార్కెట్ చైర్మన్ గుర్రప్ప నాయుడు, పట్టణ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ తేజ్, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్కే రామకృష్ణ, కౌన్సిలర్ తులసి రామకృష్ణ, నాలుగో వార్డు ఇన్చార్జ్ జాఫరున్నిసా , బిల్డర్ రామకృష్ణ, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, ఎస్ఎం రఫీ, ఎస్ ఏ మస్తాన్, డాన్స్ రెడ్డి, ఎస్ఆర్ షంషీర్, జీవి నాయుడు, జెసిబి వేణు, బాలు స్వామి, బై గారి భారతీయ నాయుడు, బిల్లీ రెడ్డి ప్రసాద్, తాళ్లగిరి, ఉపాధ్యక్షురాలు తలారి రాధా ,పులి మహాలక్ష్మి , కౌన్సిలర్ లక్ష్మీదేవి, అధికార ప్రతినిధి విజయమ్మ, నిమ్మనపల్లి రెడ్డప్ప రెడ్డి, రాజన్న, వసంత రామకృష్ణ, సహదేవ నాయుడు, కమలామరి కృష్ణ, బొమ్మిశెట్టి పురుషోత్తం, జయచంద్ర, కౌన్సిలర్ నాగార్జున బాబు, వేమయ్య, రమేష్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, మోహన్ రెడ్డి, ఇక్బాల్, నాసిర్, బాబాజాన్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు, పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :