నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 01 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కును బిల్లి సోమవారం మీడియా సమావేశం 75 ఏళ్ల రిటైర్డ్ నర్సు రేపురి బెంజిమెన్‌ను లక్ష్యంగా చేసుకున్న నిందితులు, సీబీఐ/ఈడీ అధికారులమంటూ బెదిరించి, మీ మీద కేసు ఉంది అంటూ భయపెట్టారు. డిజిటల్ అరెస్టు పేరుతో వీడియో కాల్‌లో ఉంచి, రూ.48 లక్షలు బదిలీ చేయించుకున్నారు. రాయచోటిలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిందితులు పటాన్ ఇంథియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.32 లక్షల నగదు, 25 ఏటీఎం కార్డులు, మొబైళ్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోగా, ఖాతాల్లో ఉన్న రూ.7.65 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఈ ముఠా కాంబోడియా కువైట్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన డీఎస్పీ మహేంద్ర, సీఐ రఫీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అంటూ చట్టంలో ఏం లేదు. ఎవరూ వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. ఏ దర్యాప్తు సంస్థా ఆన్‌లైన్‌లో డబ్బులు అడగదు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వచ్చిన వెంటనే 1930 కు కాల్ చేయాలి. అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. సైబర్ మోసాలపై అవగాహన కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ
Reporter
Namitha News