Tuesday, 15 September 2026 06:50:20 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

కోళ్లబైలు లో రూ.4.5 కోట్లతో 39 రోడ్లు ఏర్పాటు కోళ్లబైలు ఇన్చార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు

Date : 08 November 2025 04:32 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నవంబర్ 8: అభివృద్ధి సంక్షేమానికి టిడిపి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కోళ్లబైలు పంచాయతీలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరిగాయని కోళ్లబైలు టిడిపి ఇన్ ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోళ్లబైలు పంచాయతీలో 14 వేలకు పైగా జనాభా ఉన్నారని, 5 వేల మంది వరకు ఓటర్లు ఉన్నారని, అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు.‌ ఒక్క రోడ్డు వేయలేదని కాలువ నిర్మించలేదని విమర్శించారు. టిడిపి కూటమి సర్కార్ అధికారం చేపట్టిన 16 నెలల్లో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష కోళ్లబైలు పంచాయతీ పై ప్రత్యేక దృష్టి సారించి రూ. 4.5 కోట్ల నిధులతో 39 రోడ్లను వేయించడం జరిగిందన్నారు. అంతేకాకుండా కోళ్లబైలులో 12 వీధులకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేయడం జరిగిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని చేయకుండా తమ ప్రభుత్వం లో నిధులు కేటాయించామని వైసీపి నేత నిస్సార్ అహ్మద్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డేటా సెంటర్ ను తామే తెచ్చామని వైసీపి అధ్యక్షుడు జగన్ చెప్పుకుంటున్నట్లు నిస్సార్ అహ్మద్ మతిభ్రమించి తామే నిధులు కేటాయించామని డప్పు కొట్టుకుంటున్నారన్నారు.‌ వైసిపీ హయాంలో నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం వంద ఇళ్లు మంజూరు చేస్తే 200 ఇంటి స్థలాలు ఆక్రమించుకున్నారన్నారు. నిసార్ అహ్మద్ కు చిత్తశుద్ది ఉంటే వైసీపి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్థానిక సంస్థల‌ ఎన్నికలలో వైసిపి అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాలిమాలి శేఖర్ రాయల్, రెడ్డిశేఖర్, జివి నాయుడు, శ్రీనాథ్, రామచంద్ర, స్నేహ మెడికల్స్ రమేష్, మోహన్ రెడ్డి, అంజి,తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :