Sunday, 13 September 2026 03:52:25 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మిట్స్ లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థుల అల్యూమిని మీట్

Date : 11 April 2026 08:44 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం మరియు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల అల్యూమిని మీట్ కార్యక్రమమును నిర్వహించారు. మిట్స్ యూనివర్సిటీ నందు 2006-2010 వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఆత్మీయoగా ఒకరిని ఒకరు కలుసుకుని ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలోవైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు వారి ప్రతిభ, కృషితో పరిశ్రమల్లో ఉన్నత స్థానాలను సంపాదించడం మిట్స్ యూనివర్సిటీకు గౌరవాన్ని తీసుకువచ్చిందని అన్నారు. మీరు చదివిన కాలంలో మెకానికల్ విభాగంలో సదుపాయాలు పరిమితంగా ఉన్నా, పట్టుదలతో సవాళ్లను అధిగమించి విజయాన్ని సాధించడం గర్వకారణం అని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీ నందు ఉన్న ఆధునిక ల్యాబ్స్, CNC మెషీన్స్, CAD/CAM, 3D ప్రింటింగ్ వంటి సదుపాయాలు చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇండస్ట్రీ 4.0 ప్రభావంతో ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి రంగాల్లో మెకానికల్ ఇంజినీర్లకు మంచి డిమాండ్ ఉందని, CAD/CAM, 3D ప్రింటింగ్, CNC మెషీనింగ్ వంటి ఆధునిక తయారీ సాంకేతికతలు పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవడానికి , ఉద్యోగ అవకాశాలకు,ఇంటర్న్షిప్స్కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :