Monday, 14 September 2026 08:00:58 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పెంచుపాడులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణను సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, నిసార్ అహ్మద్

Date : 10 July 2026 06:26 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెంచుపాడులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణను సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, నిసార్ అహ్మద్ మదనపల్లి మండలం పెంచుపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పాశంవారిపల్లెలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించి, బూత్ లెవల్ ఏజెంట్లతో (బీఎల్‌ఏలు) మాట్లాడినట్లు తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమర్థవంతంగా సేవలు అందించాలని కోరారు. గడువు ముగియడానికి నాలుగు రోజులు మాత్రమే ఉన్నందున డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఎస్. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా నింపి ప్రజలకు సహకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ వివిధ దరఖాస్తు ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు తొలగింపునకు సంబంధించి ఏదైనా నోటీసు అందితే వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి దండు శేఖర్ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి కోటూరు ఈశ్వర్, నాయకులు మజ్జిగ కేశవ యాదవ్, కొత్తపల్లి నాగార్జున నాయుడు, బయ్యా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, నల్లచెరువు బాషా, శంకరనాయక్, ఫయాజ్, ఆదినారాయణ, శంకర, శ్రీనివాసులు, సుధాకర, జయరాం తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :