Saturday, 12 September 2026 12:07:19 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు

Date : 11 September 2026 06:56 PM Views : 20

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వినాయక మండపాల నిర్వహణపై పోలీసుల సూచనలు -- డి.ఎస్.పి బుచ్చిరాజు వినాయక చవితి సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసే వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని శుక్రవారం డీఎస్పీ బుచ్చిరాజు సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, విద్యుత్‌ భద్రతా చర్యలు చేపట్టడం, అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రహదారులు, కాలనీల ప్రవేశ మార్గాలను ఆక్రమించకుండా మండపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల వద్ద డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగంలో శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలని, రాత్రి వేళల్లో పరిమితులు అతిక్రమించరాదన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనల మేరకు నిర్ణీత మార్గాల్లోనే ఊరేగింపులు నిర్వహించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని డిఎస్పీ, సీఐ లు కోరారు. మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించి వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రాజారెడ్డి, టూ టౌన్ సిఐ మహమ్మద్ రఫీ, తాలూకా సిఐ కళా వెంకటరమణ, రూరల్ సీఐ రవి నాయక్, ఎస్ఐలు, వినాయక మండపాల నిర్వాహకులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :