నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 24 : ఆర్థిక స్తోమత లేని నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు శ్రీరామరక్షగా నిలిచినట్లు టిడిపి రాజంపేట పార్లమెంట్ రైతు నాయకుడు ముద్దలదొడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాలి రెడ్డి గారి పల్లె పంచాయితీలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధితో మేము ఆర్థికంగా కోలుకుంటున్నామని భవిష్యత్తులో మా కుటుంబాలు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు టిడిపి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, టిడిపి, కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News