నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 08 : తంబళ్లపల్లి మండలంలోని కొటాల పశు వైద్య ఉపకేంద్రాన్ని మదనపల్లె పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు నాయుడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పశు వైద్యశాలలో రికార్డులు తనిఖీ చేసి పశు వైద్య కేంద్రం పరిధిలోని పశువుల వివరాలు వాటికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పశువులకు గాలికుంటు వ్యాధి, ముద్ద చర్మవ్యాధి టీకాల నిర్వహణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బంది మారుమూల గ్రామాలలోని పశువులకు సకాలంలో వైద్య సేవలు అందించి పాడి రైతులకు క్షేత్రస్థాయిలో ముందస్తు సూచనలు, సలహాలు సకాలంలో అందివ్వాలని సూచించారు. పశువులకు అందించాల్సిన టీకాల పై పాడి రైతులకు అవగాహన కల్పించి సకాలంలో వేయాలని ఆదేశించారు. ఆయన వెంట పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News