Sunday, 13 September 2026 01:45:05 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల లో ర్యాగింగ్, డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం

ర్యాగింగ్, డ్రగ్స్ వల్ల నష్టాలపై వివర్ణాత్మకంగా విషదీకరించిన డిఎస్పీ బుచ్చి రాజు

Date : 08 September 2026 04:09 PM Views : 44

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 08 : మదనపల్లి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన డీఎస్పీ బుచ్చి రాజు ర్యాగింగ్‌ అంటే ఏమిటి, దాని వల్ల విద్యార్థులపై కలిగే మానసిక, శారీరక ప్రభావాలను వివరించారు. అదేవిధంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండటంతో పాటు, ర్యాగింగ్‌కు పాల్పడకుండా తోటి విద్యార్థులను గౌరవిస్తూ స్నేహపూర్వక వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ర్యాగింగ్‌, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, ఒక్క తప్పు నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందని హెచ్చరించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని డీఎస్పీ బుచ్చి రాజు పిలుపునిచ్చారు. ర్యాగింగ్‌, మాదకద్రవ్యాలకు తావులేని విద్యా వాతావరణాన్ని నిర్మించడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాగింగ్‌, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే కళాశాల యాజమాన్యం లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ బుచ్చి రాజు సూచించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: