Sunday, 13 September 2026 07:11:43 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

శ్రీజ డైరీ ఆధ్వర్యంలో రంగవల్లుల తో పులకించిన రెడ్డికోట

Date : 14 January 2026 10:49 PM Views : 254

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - జనవరి 14 : మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ శ్రీజ మహిళా ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో రెడ్డికోటలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం తో స్థానిక ప్రజలు పులకించిపోయారు. బుధవారం భోగి పండుగ సందర్భంగా తురకపల్లి క్లస్టర్ పరిధిలోని రెడ్డి కోట డైరీ ప్రాంగణంలో డైరీ మహిళా చైర్మన్ శ్రీదేవి సారధ్యంలో మహిళల రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయ కోలాటాలు వేసి అలరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీదేవి మాట్లాడుతూ మన హిందూ పండగలు మన సంస్కృతికి నిలువుటద్దమని వాటిని కొనసాగించి నేటి ఆధునిక సమాజానికి స్ఫూర్తి నివ్వాలన్నారు. సంక్రాంతి పండుగ వేళ పచ్చటి గ్రామ సీమల్లో ప్రకృతి వ్యవసాయతో పాడి పంటలు అభివృద్ధి చెంది పల్లె సీమల లోగిళ్లు సంక్రాంతి సంబరాలతో కళకళ లాడాలన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు చైర్మన్ తో పాటు డైరెక్టర్ చంద్రకళలు మొదటి, ద్వితీయ బహుమతులుగా చీరలు, బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ మధుసూదన్, ఏరియా మేనేజర్ ఎర్రి స్వామి, శ్రీజ డైరీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :