నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి మీదుగా చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న పశువుల కంటైనర్ను జనసేన నాయకులు రాయల్ గని పట్టుకున్నారు. కబేళాలకు ఆవులను తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో అమర్నాథ్, రాయల్ గణి బృందం బైపాస్ రోడ్డులో లారీని అడ్డుకున్నారు. అందులో తరలిస్తున్న గోవులను గుర్తించి వెంటనే స్థానిక టూటౌన్, తాలూకా పోలీసులకు సమాచారం అందించి లారీని అప్పగించారు. అక్రమ పశువుల రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Reporter
Namitha News