Sunday, 13 September 2026 07:59:06 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మహిళా వాకథాన్‌ లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మహిళా భద్రత మా ప్రథమ కర్తవ్యం

Date : 08 March 2026 06:31 PM Views : 363

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో ఆదివారం ఉదయం నిర్వహించిన 'మహిళా వాకథాన్' వేడుకలు అంబరాన్నంటాయి. మహిళా శక్తిని చాటేలా, వారి భద్రత పట్ల అవగాహన కల్పించేలా నిర్వహించిన ఈ భారీ ర్యాలీని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మిషన్ కాంపౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మహిళలతో కలిసి అడుగులేసిన ఎస్పీ కేవలం జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభించడమే కాకుండా, స్వయంగా ఎస్పీ గారు మహిళా పోలీసు సిబ్బంది, విద్యార్థినులు మరియు స్థానిక మహిళలతో కలిసి సుమారు 2 కిలోమీటర్ల మేర నడిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ వాకథాన్‌లో ఎస్పీ గారు మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళల నినాదాలతో మదనపల్లి వీధులు మార్మోగాయి. మహిళలను ఏడిపిస్తున్న ఆకతాయిలను ఎలా ఎదుర్కోవాలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు చేసిన నాటక ప్రదర్చన ఎంత గానో ఆకట్టుకుంది

మహిళా భద్రత మా ప్రథమ కర్తవ్యం అంటూ ర్యాలీ అనంతరం బి.టి. కళాశాల పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ గారు ప్రసంగిస్తూ సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పోలీసు శాఖ నిరంతరం పని చేస్తోందని తెలిపారు. "మహిళలకు ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. "నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏ శక్తినైనా అణిచివేసేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. శక్తి టీమ్స్, శక్తి యాప్ మరియు 112 నంబర్ సేవలను ప్రతి మహిళా వినియోగించుకోవాలి. మీ రక్షణ కోసం మేము నిరంతరం పహారా కాస్తాము." అని పేర్కొన్నారు.

విజేతలకు ప్రోత్సాహం బహుమతులు అందచేసిన ఎస్పీ ఈ వాకథాన్‌లో ఎంతో చురుగ్గా పాల్గొని లక్ష్యాన్ని చేరుకున్న మహిళలలో 10 మందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారికి జ్ఞాపికలను, బహుమతులను అందజేస్తూ, వారిలోని స్ఫూర్తిని కొనియాడారు. బహుమతులు అందుకున్న వారిలో విద్యార్థినులతో పాటు గృహిణులు కూడా ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, పలువురు సీఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పెద్ద సంఖ్యలో మహిళలు పోలీసులు మరియు పట్టణ వాసులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :