నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణం నందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్ర రెడ్డి (చల్లా బాబురెడ్డి )గారు మహిళలతో కలిసి ట్రావెల్స్ బంగ్లా నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.* *మహిళలను గుర్తించి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని మహానాడులో హామీ ఇచ్చిన గౌరవ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమినేత పవన్ కళ్యాణ్ గారికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు.* *ఈ సందర్భంగా చల్లా బాబురెడ్డి గారు ప్రసంగిస్తూ మహిళలకు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే గుర్తింపు లభించిందని ఆస్తిలో పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిదని మరియు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన ఘనత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిదని మరియు తెలుగుదేశం పార్టీది అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో మహిళలను ప్రోత్సహించేలాగా మరియు రాజకీయ నాయకులుగా తయారు చేసేందుకు 33% రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తుందని కావున మహిళలందరూ ప్రత్యేకంగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి కూటమినేత పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని కోరారు.*రూరల్ టిడిపి సీనియర్ నాయకులు మాధవరెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ శమీపతి, రాష్ట్ర గిరిజన ట్రై కార్ డైరెక్టర్ భూక్యా కృష్ణ నాయక్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్రవతమ్మ,గంగాధర,రెడ్డెప్ప నాయుడు,కో డైరెక్టర్ కోలాట రమణ, రఘువ,తెలుగు మహిళ కవితమ్మ, జయశ్రీ,భాస్కర్ రెడ్డి, మరియు గ్రామ పంచాయతీ అధ్యక్షులు రామ కృష్ణ,సుబ్రహ్మణ్యం *ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున మహిళలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*
Reporter
Namitha News