Saturday, 12 September 2026 02:52:42 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి

Date : 20 April 2026 08:28 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచించారు. సోమవారం స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపము నందు పాఠశాల 26వ వార్షికోత్సవ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు మొరుంపల్లి రజనిల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. ఉన్నత చదువులకు పోయే కొద్దీ సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగితే లక్ష్యాలను అధిగమించవచ్చునన్నారు. తమ పాఠశాలలో విద్యతోపాటు సామాజిక స్పృహ, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. సీనియర్లు, జూనియర్లకు ప్రేరణగా నిలవాలన్నారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను చక్కగా అలవర్చుకొని,తల్లిదండ్రుల సూచనలు పాటించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. పాతికేళ్లుగా తమ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం గర్వంగా ఉందన్నారు. మా సుదీర్ఘ ప్రయాణంలో పాఠశాలాభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు,కృషి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సహదేవ రెడ్డి, రజనిల నృత్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: