నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో వైభవంగా లాక్మీ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభం - హాజరైన మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా - ఘనస్వాగతం పలికిన యాజమానులు వెంకటేష్ బాబు,సౌజన్య మదనపల్లె : అన్నమయ్య జిల్లా,మదనపల్లి పట్టణంలో అధునాతన హంగులతో లాక్మీ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించబడింది.శనివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్,మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముందుగా అతిథులకు అకాడమీ నిర్వాహకులు సత్రపాల వెంకటేష్ బాబు,సౌజన్యలు అపూర్వ స్వాగతం పలికి శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు మాట్లాడుతూ బెంగళూరు,చెన్నై,హైదరాబాద్ వంటి నగరాల వినూత్నమైన బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకునే యువతీ యువకులకు లాక్మి అకాడమీ చక్కని వేదిక అన్నారు.ఈ అకాడమీని ఏర్పాటు చేసిన వెంకటేష్ బాబు,సౌజన్యలను అభినందిస్తున్నామన్నారు.అకాడమీలో శిక్షణ తీసుకుంటే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ అవకాశాన్ని మదనపల్లి పరిసర ప్రాంతాలు యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం అకాడమీ నిర్వహకులు వెంకటేష్ బాబు,సౌజన్యలు మాట్లాడుతూ బ్యూటీ మరియు మేకప్ విభాగాలలో ఆసక్తి ఉన్నవారికి టాప్ మేకప్ ఆర్టిస్ట్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు.అదేవిధంగా ఇంటర్నషిప్స్,ప్లేస్మెంట్స్ లభించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.టాలెంటుని ప్రొఫెషనల్ కెరియరుగా మలుచుకునేందుకు ఇది గొప్ప అవకాశమన్నారు.మేకప్,స్కిన్,హెయిర్,కాస్మాటాలాజీ వంటి స్పెషలైజేషన్ కోర్సులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.రూ.10 వేల నుండి కోర్సులు ప్రారంభమవుతాయని,అకాడమీ ప్రారంభోత్సవ ఆఫరుగా కోర్సులపై 40% శాతం రాయితీ అందిస్తున్నట్లు వెల్లడించారు.మరిన్ని వివరాలకు అనిబిసెంట్ కూడలి,బెంగళూరు రోడ్డులోని లాక్మీ అకాడమీ,9992229149 అనే మొబైల్ నెంబరును సంప్రదించాలని కోరారు.మా ఆహ్వానం మేరకు హాజరైన మంత్రి,ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ గ్రాండ్స్ అధినేత సుధాకర్ రెడ్డి,టిడిపి నాయకులు మండిపల్లి మధుసూదన్ రెడ్డి,తమ్మిశెట్టి రామకృష్ణ,బాలమాలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News