Wednesday, 29 July 2026 09:20:27 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

వాటర్ గ్రిడ్ తో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు - డి.ఈ.డి. చంద్రశేఖర్ రెడ్డి

Date : 05 December 2025 08:41 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 05 : ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ద్వారా భవిష్యత్తులో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేస్తామని వాటర్ గ్రిడ్ డి.ఈ డి. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ జి. వినోద్ కుమార్ తో కలిసి వాటర్ గ్రిడ్ పైపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 2370 కోట్లతో తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో 18 మండలాలకు ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. గండికోట జలాశయం ద్వారా తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లోని 12 మండలాలు,రాయచోటి నగరానికి చెందిన ఆరు మండలాలకు వెలిగల్లు జలాశయం ద్వారా తాగునీరు పంపిణీ జరుగుతుందన్నారు. పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ లో నీటి శుద్ధి ప్లాంటేషన్లు నిర్మించి అక్కడి నుండి స్వచ్ఛమైన తాగునీరు ప్రతి గ్రామం తద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తామన్నారు. ఈ వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం, పైపు లైన్లు పనులు మరో 20 రోజుల్లో ప్రారంభించి వేగవంతం చేస్తామన్నారు. భవిష్యత్తులోఈ మూడు నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలు తీరుతాయని తెలిపారు. ఆయన వెంట బోర్ మెకానిక్ మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: